Home » Scheme : రాష్ట్ర మహిళలకు శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం

Scheme : రాష్ట్ర మహిళలకు శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం

Scheme : రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. రేషన్ కార్డు తో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరుతో మంజూరు చేయడానికి సిద్దమైనది. అదే విదంగా సోలార్ పవర్ ప్లాంట్ లను కూడా మహిళలకే ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకొంది.

ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ కింద తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అందులో భాగంగా ఉచితంగా కుట్టు మిషన్ లను మంజూరు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైనది.

అర్హులైన వారు నేరుగా.. https://tgobmms.cgg.gov.in  లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో వచ్చిన దరఖాస్తులో పేరు, విద్యార్హతలు, రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మతం, టైలరింగ్ శిక్షణ సెర్టిఫికెట్, ఇంటి చిరునామా పూర్తి చేయాలి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *