Singareni : వొడ్నాల రాజన్న పని చేస్తున్నాడంటే అతన్ని చూసి నేర్చుకోవాల్సిందేనని కాసిపేట -1 గని మేనేజర్ భూ శంకరయ్య అన్నారు. సింగరేణిలో వివిధ విభాగాల్లో 37 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి శుక్రవారం పదవి విరమణ పొందారు. ఈ సందర్బంగా రాజన్న దంపతులను గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ పనిలో రాజన్న ఎప్పుడు కూడా వెనుకబడినట్టుగా కనిపించలేదన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ రాజన్న మంచికి మారుపేరని, సమస్యను పరిష్కరించడంలో ముందుంటారని అన్నారు. అనంతరం రాజన్న మాట్లాడుతూ గని అధికారులు, సూపెర్వైజర్లు, కార్మికుల సహకారంతోనే తాను విధులు నిర్వహించానని అన్నారు. ఈ కార్యక్రమంలో…..
రక్షణ అధికారి రవీంద్ర నిఖిల్,డిప్యూటీ మేనేజర్ వెంకటేష్,ఇంజనీర్లు మధుకర్,సంక్షేమ అధికారి మీర్జా జిస్ జీషాన్, AITUC బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ బియ్యల వెంకట స్వామి, పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మీ నారాయణ, INTUC కేంద్ర ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్, కార్యవర్గ సభ్యులు మీద సమ్మయ్య, పిట్ సెక్రెటరీ రవీందర్, కన్నయ్య, రాజన్న, తో పాటు
బెల్లంపల్లి మాజీ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ నాయకులు మెడిపెళ్లి సంపత్, జె రవీందర్, O. రాజశేఖర్, SC/ST అసోసియేషన్ నాయకులు కనుకుల తిరుపతి, కృష్ణ, బాబు, దరావత్ తిరుపతి, CITU నాయకులు వెంకట స్వామి,దెబ్బడి తిరుపతి, ఉద్యోగ సంఘాలు, మున్నూరు కాపు సంఘం మండల నాయకులు సిద్ధం తిరుపతి, అగ్గి సత్తయ్య, ఉష్కమల్ల గోపాల్, బాపు, రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు, మాజీ సర్పంచ్ వేముల కృష్ణ, ఏఐటీయూసీ పిట్,సేఫ్టీ కమిటీ నాయకులు రాజేందర్, ఆంజనేయులు, అనిల్, రవీందర్, రంజిత్, వివిధ యూనియన్ల కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.