Home » IFTU : ప్రభుత్వమే సంక్షేమ బోర్డు పథకాలను అందించాలి.

IFTU : ప్రభుత్వమే సంక్షేమ బోర్డు పథకాలను అందించాలి.

IFTU : భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించరాదని, ప్రభుత్వమే నేరుగా సంక్షేమ బోర్డు పథకాలను కార్మికులకు అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం. ఐ ఎఫ్ టీ యు. పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఏ.ఎల్.ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఎల్ఓ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ……ఐ ఎఫ్ టీ యు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ. నరేష్. మాట్లాడుతూ ….

కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనులు దొరకక పని స్థలాల్లో రక్షణ లేక శ్రమకు తగిన ప్రతిఫలం లభించక అనేక విధాలుగా నష్టపోతున్నారని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక కుటుంబాలు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భవన నిర్మాణ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా 10.లక్షల రూపాయలు ఇవ్వాలని, 55.సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 10.వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరికీ పక్కా గృహాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు కే.ఎల్లయ్య, ఐ.రాజేశం, ఎం. దుర్గయ్య, జీ. మల్లేశం, ఎడ్ల. రవికుమార్, ఎం. కొమరయ్య, బి. రాజనర్సు, గుండు రాజయ్య, కే రాజమౌళి, భూషణం, ఐ సాంబయ్య, రేణిగుంట్ల సదయ్య,అన్వేష్. తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *