IK !A గనిని సందర్శించిన గుర్తింపు సంఘం
సమస్యలపై అధికారులతో చర్చ
Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని IK -1A సింగరేణి గనిని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) నాయకులు గురువారం సందర్శించారు. ఆ గని అధికారులతో కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్బంగా ఈ సందర్బంగ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాజీ సైదా లు మాట్లాడుతూ …..
కార్మికులకు నాణ్యమైన పనిముట్ల తో పాటు, బూట్లు సరఫరా చేయాలనీ అధికారులను కోరడం జరిగిందన్నారు. కార్మికుల సంఖ్యకు సరిపడేంత పార్కింగ్ షెడ్ లను నిర్మించాలని కోరినట్టుగా తెలిపారు. పని ప్రదేశాల్లో తాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. రాబోయేది వేసవి కాలం కాబట్టి, కార్మికులకు తగినంతగా నీడ వసతిని కూడా ఏర్పాటు చేయాలన్నారు. గుర్తింపు సంఘం నాయకులు సూచించిన సమస్యలను పరిష్కరించడానికి గని అధికారులు హామీ ఇచ్చినట్టుగా నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జిఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, బద్రి బుచ్చయ్య, ఫిట్ కార్యదర్శి నవీన్ రెడ్డి, అగ్గు శ్రీకాంత్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, మైనింగ్ స్టాప్ బ్రాంచ్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బాలకృష్ణ, నాయకులు దేవేందర్, సత్తయ్య, రమేష్ ,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.