Home » Singareni : సింగరేణి సంస్థను కాపాడే సత్తా INTUC కే ఉంది.

Singareni : సింగరేణి సంస్థను కాపాడే సత్తా INTUC కే ఉంది.

Singareni : సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకునే సత్తా కేవలం INTUC యూనియన్ కే ఉందని ఆ యూనియన్ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య స్పష్టం చేశారు. గురువారం మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగ కాంపెల్లి సమ్మయ్య ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఇక్కడ వేలాది కార్మికుల కుటుంబాల కడుపు కొట్టాలని చూస్తుందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.

అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక మరియు సింగరేణి ప్రాంత అభివృద్ధి వ్యతిరేక చర్యల వల్ల తెలంగాణా బిడ్డలు గడిచిన పది సంవత్సరాలలో ఉపాధికి నోచుకోలేదన్నారు. అబివృద్ధి చేయకుండా అప్పుల తెలంగాణ గా గత BRS పాలకులు చేసి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకున్నారని .ఆరోపించారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేంద్రంలో ఉన్న బి. జే. పి తో అంటకాగి, MMDR-2015 చట్టానికి BRS పార్టీకి చెందిన 13 మంది ఎం.పీ లు మద్దతు తెలియజేసి ప్రయివేటీకరణ ను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. పేదలను కొట్టి పెద్దలకు సంపద ను దోచి పెట్టాలన్న సిద్ధాంతం తో కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. వికసిత్ భారత్ పేరుతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని సమ్మయ్య ఆరోపించారు.

ఏటా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గల సింగరేణి ఉనికే లేకుండా చేస్తాము అని ఆలోచిస్తే సింగరేణిలో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందన్నారు. MMDR చట్టంలో 17(A) క్లాస్ ప్రకారం బొగ్గు బ్లాకుల ను ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి కూడా వేలం వేయడం దేనికి సంకేతమని సమ్మయ్య ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతే కాకుండా సింగరేణి సంస్థ కు బొగ్గు ఉత్పత్తి లో అపార అనుభవంతో పాటు కోల్ ఇండియాకి దీటుగా ఉత్పతి సాధిస్తూ, వరుస లాభాలు గడిస్తూ, అనుభవం ఉన్న అధికారులు, కష్టపడేతత్వం ఉన్న కార్మిక వర్గం ఉన్న విషయం తెలిసి కూడా పెట్టుబడి దారుల కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవడం సరికాదన్నారు. .

గతం లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ప్రస్తుత బి.జే పీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ను వారి స్నేహితులైన పెద్ద పెద్ద పెట్టుబడి దారులకు అప్పజెప్పుతున్నారని .ఆయన ఆరోపించారు. ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తున్న మోడీకి కార్మికులు తప్పక గుణపాఠం చెబుతారని, సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడం కేవలం ఐఎన్టీయూసీ తోనే సాధ్యమవు తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంశేట్టి నరేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుల్లురి లక్ష్మణ్, కేంద్ర కమిటీ నాయకులు మిట్ట సూర్యనారాయణ, వెంకటస్వామి, ఏరియా కార్యదర్శులు బత్తుల వేణు, భిక్షపతి, నాయకులు కారుకురి తిరుపతి, శంకర్ రావు,కల్పన, జాడి లలిత,శనిగరపు రాములు, ch.రమేష్, సాంబయ్య, సదయ్య, శివ, సుదర్శన్ రెడ్డి, దొడ్ల కిషోర్, హానుమండ్ల రాజేంద్ర ప్రసాద్ , కలమండ స్వామి, కృష్ణమోహన్, కన్నయ్య, ఇదునూరి బాపు, సంగ బుచ్చయ్య, రవి కిరణ్, గొర్ల శ్రీనివాస్, సత్యనారాయణ, జగన్నాథ్ చారి, సంపత్, చంద్రమౌళి,చిలక రాజనర్సు, పెద్దపల్లి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *