Venkatesh : హీరో వెంకటేష్ మంచి దూకుడు మీద ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయ వంతం అయ్యింది. రూ : 300 కోట్ల వసూళ్ల కు చేరువలో ఉంది. దింతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బృందం ఆనందంలో ఉంది. హీరో వెంకటేష్ కూడా ఇంత పెద్ద విజయాన్ని ఆయన సినీ జీవితంలో చూడలేదు. అంతే కాదు ఇంత భారీ కలెక్షన్ లు కూడా ఆయన నటించిన ఏ సినిమా కూడా వసూళ్లు చేయలేదు.
ఆయన నటించిన దృశ్యం సినిమా విజయ వంతమయ్యింది. ఆ సినిమాకు సీక్వెన్సీగా దృశ్యం-2 ను కూడా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దృశ్యం-2 ను కూడా నిర్మాణంలో ఎక్కడ కూడా రాజీ పడటంలేదు పెట్టుబడిదారులు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి బహుమతి ఇచ్చింది వెంకీ మామ కు. అదేవిదంగా దృశ్యం -2 కూడా భారీ కలెక్షన్ సాధించాలనే పట్టుదలతో చిత్ర బృందం ఆశిస్తోంది.
దృశ్యం-2 ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనుల్లో ఉంది. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్. సినిమాలో ప్రదర్శించిన సస్పెన్స్ కూడా ఆసక్తికరంగా సాగేలా తెరకెక్కించాడట దర్శకుడు జీతుజోసెఫ్. దృశ్యం- 2 లో పోలీసులు వెంకటేష్ ను పట్టుకునే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిసింది. పోలీసులు వేసే ఎత్తులకు వెంకీ మామ కూడా పై ఎత్తులు వేసి తప్పించునే సీన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందని చిత్ర బృందం అంటోంది. వేసవిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర బృందం అంటోంది. ఈ సినిమా వెంకీ అభిమానులను ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.