Actor : సినిమా రంగం ఒక రంగుల ప్రపంచం. కష్టం… ప్రతిభను నమ్ముకున్నప్పటికీ ఒక్కోసారి కలిసి రాదు. అదృష్టాన్ని నమ్ముకుంటే కూడా పైకి రావచ్చు. లేదంటే ఇంటికి రావచ్చు. సినిమా ప్రపంచంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయిన సందర్భాలు ఉన్నాయి. నిజజీవితంలో కూడా ఓటమి చెందిన వారు ఉన్నారు. నిజజీవితంలో విజయవంతం అయిన వారు సైతం ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం 700 కు పైగా సినిమల్లో నటించింది. ఒక్క భాషకే పరిమితం కాలేదు. ఐదారు భాషల్లో నటించి బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. కానీ రెండు పెళ్లిళ్లు చేసుకొంది. ఆ నటి ఎవరంటే …..
ప్రముఖ నటి ఊర్వశికి తన నిజ జీవితంలో వ్యక్తిగత సమస్యలు కూడా ఎదురైనాయి. దింతో మానసికంగా కుంగిపోయిందనే ప్రచారం కూడా చిత్ర పరిశ్రమలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె మద్యానికి బానిస అయ్యిందనే ప్రచారం చిత్ర పరిశ్రమలో జోరుగా సాగింది. దింతో ఆమె నటనకు కూడా ఇబ్బందులు ఎదురైనాయి.
మొదటి భర్త మనోజ్ కె జయన్ తో విభేదాలు తలెత్తాయి. వీరిద్దరికి ఒక అమ్మాయి సంతానం. పాప పుట్టిన తరువాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త మనోజ్ తో విడాకులు తీసుకుంది. ఆ తరువాత చెన్నయ్ కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక కుమారుడు. ప్రస్తుతానికి రెండో భర్త తో నటి ఊర్వశి ఆనందకరమైన జీవితాన్ని గడపటం విశేషం.