Karpooram : ప్రతిరోజూ ఇంట్లో కొందరు పూజలు చేస్తారు. కొందరు వారానికి ఒకసారి పూజ చేస్తారు. మరికొందరు ఇంటితో పాటు దేవస్థానాల్లో సైతం పూజలు చేస్తారు. పూజ సమయంలో కర్పూరంతో హారతి ఇచ్చి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. ఇంటిలో కర్పూరంను రోజుకు ఒకసారి వెలిగిస్తే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని వేద శాస్త్రంలో చెప్పబడింది.
ఇంటిలో కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరు ఆనందంతో గడుపుతారు. ఎల్లవేళలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని వేదంలో చెప్పబడింది.
ప్రతిరోజూ కర్పూరాన్ని ఇంటిలో వెలిగించడం వలన సమస్యలు తొలగిపోతాయి. గొడవలు రావు. ఎప్పుడూ సంతోషంగా గడుపుతారు. సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని వేదశాస్త్రం చెబుతుంది.నిర్ణీత సమయంలో చేయాల్సిన పనులు పూర్తవుతాయి. శాంతి, శ్రేయస్సు, ఆనందం కలుగుతుంది.
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో నష్టాలు తగ్గి, లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల్లో సఖ్యత పెరుగుతుందని వేద శాస్త్రంలో చెప్పబడింది.