Vishnu : హిందూ కుటుంబాలకు విష్ణు సహస్రనామ స్తోత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం వివిధ భాషల్లో సహస్రనామాలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఆ నామాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి. ఎవరు, ఎప్పుడు రాశారు. అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం…..
విష్ణుమూర్తి గొప్పదనాన్ని తెలియజెప్పే నామాలనే విష్ణుసహస్ర నామాలు అని పిలువబడుతాయి. మహాభారత కాలంలో మొట్ట మొదటిసారి వీటిని ఉచ్ఛరించింది భీష్మ పితామహుడు. అందుకోసమే ఆ నామాల్లో భీష్మ ఉవాచ అని ప్రత్యేకంగా ప్రస్తావన వస్తుందని వేదంలో చెప్పబడింది. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముడు అంపశయ్యపై ఉండి కూడా విష్ణుసహస్రనామాలు పలుకుతాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పాండవులు, కృషుడు, వ్యాసమహర్షి అంతా కూడా శ్రద్దగా విన్నారు.
కానీ వాటిని రాయడానికి ఎవరు కూడా ప్రయత్నించలేదు. యుద్ధం ముగిసాక వాటిని రాయాలని అక్కడ ఉన్న వారందరికీ వచ్చింది. కానీ కృష్ణుడుకి మాత్రం విష్ణు సహస్ర నామాలను రాయాలని ఆలోచన వచ్చింది. అప్పుడు శ్రీ కృష్ణుడి సలహాతో సహదేవుడు మరోసారి వినిపించేలా చేయగా, వ్యాస మహర్షి వాటిని అక్షర రూపంలో రాయడం జరిగింది. అప్పటి నుంచి వివిధ భాషల్లో విష్ణు సహస్ర నామాలు అందుబాటులోకి రావడం జరిగిందని వేదంలో చెప్పబడింది.