Thirupathi : కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల కమిటీల ఎంపిక కోసం రాష్ట్ర కమిటీ ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో భాగంగా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ కు చెందిన చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త మాయ తిరుపతి ఎన్నికల్లో పోటీ చేశాడు. గురువారం ఎన్నికల ఫలితాలను పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ పోటీలో మాయ తిరుపతి పార్టీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించాడు.
విద్యార్ధి దశ నుంచే తిరుపతి పార్టీలో సేవలు అందిస్తున్నాడు. 2008 నుంచి పార్టీ అప్పగించిన భాద్యతలను నెరవేరుస్తున్నాడు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తన వార్డు నుంచి తిరుపతి ప్రత్యర్థులకంటే అధికంగా మెజార్టీ వచ్చే విదంగా కృషిచేయడం విశేషం.
ఈ సందర్బంగా మాయ తిరుపతి మాట్లాడుతూ తన విజయానికి కృషిచేసిన పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిదంగా తన గెలుపు కోసం ఓటు వేసిన కార్యకర్తలకు కూడా ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాబోయే మున్సిపాల్టీ, మండల, జిల్లా పరిషద్, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించడానికి తనవంతు కృషిచేస్తానని స్పష్టం చేశారు. యువజన విభాగాన్ని మందమర్రి మండలంలో మరింత బలోపేతం చేసితీరుతానని అన్నారు.