Home » Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ముమూర్తం ఖరారు…..

Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ముమూర్తం ఖరారు…..

Ration Card : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు గత పదేళ్ల నుంచి మంజూరు కాలేదు. రాష్ట్రము ఏర్పడిన నాటి నుంచి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం వరకే పరిమితం అయ్యారు. కానీ కార్డు మంజూరు కాకపోవడంతో అర్హులైన వారు నిరాశతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి అదిగో, ఇదిగో అనే వార్తలు వినబడుతున్నాయి. ఎట్టకేలకు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల మంజూరు ముహూర్తం ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేస్తుంది. వీటి ద్వారా సంబంధిత రేషన్ దుఖాణాల్లో బియ్యంతో పాటు కొన్ని వంటసరుకులను కూడా తక్కువ ధరకె ప్రభుత్వం సరఫరా చేస్తుంది.ఈ రేషన్ కార్డులు కేవలం సరుకులు తెచుకోడానికే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే సంక్షేమ పథకాలకు కూడా ఉపయోగపడుతుంది. అదే విదంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి రుణాలు మంజూరు చేయాలంటే కూడా రేషన్ కార్డు తప్పనిసరి.

కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. కార్డుల మంజూరు కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి మార్గదర్శకాలు, నిభందనల గురించి చర్చించి జారీ చేస్తామని మంత్రులు ఈ పాటికే ప్రకటించారు. మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు దరఖాస్తులను స్వీకరిస్తుంది.

ఆ తరువాత ప్రజాపాలన ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులను అందజేయనున్నామని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. ఆగష్టు 15 తేదీ నాటికి రైతు రుణాలను మాఫీ పూర్తిగా చేయనున్నామని, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్హులైన కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *