Home » Singareni : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోని యాజమాన్యం…. IFTU

Singareni : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోని యాజమాన్యం…. IFTU

Singareni IFTU : సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం పట్టించుకోవడం లేదని IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్ ఆరోపించారు. గత కొన్నేళ్లుగా వారితో యాజమాన్యం వెట్టి చాకిరీ చేయిస్తున్నది. కానీ వారికి కనీసం ఎలాంటి హక్కులు ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. సోమవారం గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అయన యూనియన్ నాయకులను, కార్యకర్తలను, కాంట్రాక్టు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల విధులు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలవుతున్న హక్కులు సింగరేణిలో వీరికి అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. పండుగ సెలవులు, లీవులు, సర్వీస్ పే, ఉచిత వైద్యం, అమలు కాకపోవడంతో అనేక విధాలుగా కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబాలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

11.వ వేజ్ బోర్డు లో భాగంగా 9/ 8/ 2023 రోజున ఒప్పందమైన కోల్ ఇండియా వేతనాలు సింగరేణి లోని అన్ని డిపార్ట్మెంట్ కాంటాక్ట్ కార్మికులకు అమలు చేయడం లేదు. కోల్ ఇండియాలో వేతనాలను ప్రస్తుతం అన్ స్కిల్ 1176/- సెమీ స్కిల్డ్ 1206/- స్కిల్డ్ 1236/- హై స్కూల్ 1266/- యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. కానీ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా వేతనాలు అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు వేతన సవరణ చేసి 30% పిఆర్సిని అమలు చేయాలని శ్రీనివాస్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. 11వ జేబీసీసీఐ లో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం కోల్ ఇండియాలో వేతనాలు చెల్లించినట్లు సింగరేణిలో కూడా అన్ని డిపార్ట్మెంట్ కాంటాక్ట్ కార్మికులకు చెల్లించాలని శ్రీనివాస్ ఈ సందర్బంగ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, సింగరేణి హాలిడేస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డి బ్రహ్మానందం, ఏ వెంకన్న, ఆఫీస్ బేరర్స్ బంధు అశోక్, జి మల్లేష్, బి యాదగిరి, జి శోభ, నాయకులు ఈ నరేష్, రవికుమార్, ప్రవీణ్. తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *