YSRCP Roja : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవిలో ఉన్నన్ని రోజులు జగనన్న…జగనన్న.. జగనన్న…..పేరు జపించారు మాజీ మంత్రి, నటి రోజా. ఇప్పుడు రోజా ఉలుకు, పలుకు, పిలుపు కు దూరమైపోయింది. పార్టీ కార్యక్రమాలకు పిలివడం లేదు. ఒకవేళ పిలిచినా ఆమె వెళ్లడం లేదు. అసెంబ్లీ గేట్ టచ్ చేయలేరు. జగనన్న చిటికెన వేలు మీది వెంట్రుక కూడా పీకలేరు అంటూ ప్రగల్బాలు పలికింది రోజా. గుండెల నిండా పార్టీని నింపుకున్న రోజా ఇప్పుడు పార్టీ గుమ్మంవైపు కూడా కన్నెత్తి చూడడం లేదు . ఇటీవల ముగిసిన ఎన్నికల్లో రోజా కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలిచి పరువు దక్కించుకోలేదు.
ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్ల కాలంలో పార్టీ తో పాటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నటు వంటి ఫోటోలను తన మొబైల్ నుంచి తొలగిస్తున్నట్టుగా గుసగుసలు మొదలైనాయి. అంతే కాదు పార్టీ కార్యక్రమాలకు పిలిచినా వెళ్లడం లేదని తెలుస్తోంది. కనీసం ఆమె తన నియోజకవర్గంలో ఓటమి చెందిన నాటి నుంచి పర్యటించలేదు. ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించలేదు. రోజాను కొన్ని వర్గాలు కలిసే ఓడించాయనే పేరు కూడా ఉంది. ఎవరైతే ఓటమి చెందారో వాళ్లనే ఆ నియోజకవర్గానికి పార్టీ ఇంచార్జ్ గా నియమించింది. కానీ రోజా విషయంలో పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు.
నగరి నియోజకవర్గం లో పార్టీ ఓటమికి ప్రధాన కారకురాలు రోజా అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆమెను పార్టీకి ఎంత దూరం పెడితే అంత మేలు జరుగుతుందనే ఫిర్యాదులు కూడా జగన్ కు చేరినట్టు తెలుస్తోంది. కావాలనే ఆమెను పార్టీ కార్యక్రమాలకు పిలువడంలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కోపంతో ఫోటోలు, వీడియో లను తొలగిస్తున్నట్టుగా కూడా అభిప్రాయాలను రోజా వర్గాలు వెల్లడిస్తున్నాయి.