Pavan Kalyan : సుమారు ఆరునెలలపాటు ఎన్నికల హడావుడి. విస్తృత ప్రచారం. అభ్యర్థుల ఎంపిక. ప్రభుత్వం ఏర్పాటు. భాద్యతలు స్వీకరణ. ప్రజల విన్నపాలు వినడం. ప్రజల సమస్యల పరిస్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశాలు. ఇలా నిరంతరం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు ఆ రాష్ట్ర మంత్రి. ఇప్పుడు ఆయన రాష్ట్ర మంత్రి తో పాటు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కూడా. కాస్త తీరిక దొరికింది. అందుకే గతంలో ఒప్పుకున్న సినిమాలు మధ్యంతరంగా నిలిచిపోయాయి. ఇప్పుడు అసంపూర్తిగా నిలిచిపోయిన సినిమాలను పూర్తి చేయడానికి ఆ రాష్ట్ర మంత్రి సిద్ధమవుతున్నారు. ఆ మంత్రి ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఆగిపోయిన ” ఓజీ ” సినిమాను ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ చేయాలని నిర్ణయించినట్టు చిత్ర బృందం సమాచారం. గతంలో ఒప్పుకున్న సినిమాలు ఉన్నవి. కానీ ముందుగా ” ఓజి ” సినిమానే పూర్తి చేయాలని, అందుకు సంబందించిన డేట్లు కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగిందని సమాచారం. ఇటీవలనే ఆ సినిమా నిర్మాత దానయ్య కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారని సమాచారం. దింతో “ఓజి” సినిమాను ముందుగా పూర్తి చేద్దామని పవన్ కళ్యాణ్ కూడా నిర్మాత దానయ్య కు హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఈ ఏడాది కూడా ” ఉస్తాద్ భగత్ సింగ్ ” సినిమాను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని చిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం. ముందుగా ” ఓజి ” సినిమాను పూర్తి చేసిన తరువాతనే ” ఉస్తాద్ ” ను మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ” ఓజి ” ” ఉస్తాద్ భగత్ సింగ్ ” సినిమాలు పూర్తి చేసిన తరువాతనే ” హరి హర వీరమల్లు ” సినిమా షూటింగ్ మొదలు పెడుతారని చిత్ర పరిశ్రమలో టాక్.