Bank Recruitment : డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ, యువకులకు మంచి అవకాశం. బ్యాంకు ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నియామకం ప్రకటన విడుదల చేశారు. మొత్తం వివిధ బ్యాంకులలో ఖాళీగా ఉన్న పోస్టులు 6,128. ప్రారంభంలో అన్ని అలవెన్సులు కలిపి రు: 50 వేలు సుమారుగా చేతికి వస్తుంది. దేశ వ్యాప్తంగా 6,128 ఖాళీగా ఉండగా, తెలంగాణాలో 104, ఏపీ లో 105 పోస్టులు ఖాళీగా ఉన్నవి.
అభ్యర్థులు దరఖాస్తు చేసేనాటికి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. జనరల్ క్యాటగిరి అభ్యర్థుల వయసు 20 ఎళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన వారికీ ప్రభుత్వ నిబంధనల మేరకు వయసు సడలింపు ఉంటుంది.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిదంగా ఎక్స్-సర్వీస్మెన్, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు మాత్రం రూ.175 చెల్లించాలి.అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్: https://www.ibps.in/ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక : అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని మెయిన్స్ రాత పరీక్షకు ఎంపిక చేసి పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ లో వచ్చిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి మౌఖిక పరీక్షకు పిలుస్తారు. సర్టిఫికెట్స్ ను పరిశీలించిన తరువాత అభ్యర్థులను వైద్య పరీక్షలకు పంపుతారు. అప్పుడు అర్హులైన అభ్యర్థులను ఉదయిగానికి ఎంపిక చేస్తారు.
పోస్టులు ఖాళీగా ఉన్న బ్యాంకులు : పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్.
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. చివరి తేదీ 2024 జులై 21, ప్రిలిమినరీ పరీక్ష 2024 ఆగస్టు 24, 25, 31. మెయిన్ పరీక్ష 2024 అక్టోబర్ 13. తెలంగాణాలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.