2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
మిథునం రాశి
మృగశిర 3,4పాదాలు. ఆర్ద్ర,పునర్వసు 1,2,3పాదాలు
ఆదాయము 5, వ్యయం 5,రాజపూజ్యమ్ , అవమానం 6
ఉద్యోగంలో పదవిలాభం ఉంది. వ్యాపారంలో ధనలాభం సూచిస్తుంది. వ్యవసాయం కలిసివస్తుంది.రైతులు వేసే ప్రతి పంటలో అధికదిగుబడి వస్తుంది.శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. రైతులు నమ్ముకున్న ప్రతి పంట కూడా బంగారం లాంటి పంటలే పండుతాయి. రైతుల కష్టాలు తొలిగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మే తరువాత గురుబలం తగ్గుతుంది. కాబట్టి చేసే ప్రతిపనిలో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి నైపుణ్యంతో ఉన్నత స్థాయిని చేరుకుంటారు.శత్రువులు మిత్రులవుతారు.శని,కేతు శ్లోకాలు చదివినచో శాంతి,సుఖం లభిస్తుంది.మిధున రాశి వారికీ 50 శాతం పైబడి అదృష్ట యోగం ఉంది.