T -20-Cup : కెప్టెన్ గా క్రికెట్ జట్టును ముందుకు నడిపించడం అంత ఆషామాషీ కాదు. జట్టు విజయం సాధించే భాద్యత అంతా కెప్టెన్ మీదనే ఉంటది. అంతే కాదు ఆతను బ్యాటింగ్ చేసి కూడా జట్టును ఆదుకోవాల్సి కూడా ఉంటది. జట్టు ఓటమికి దగ్గరలో ఉందంటే కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటది.
జట్టు ఎంపికలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది. ఓపెనింగ్ ఆడటానికి ఎవరిని ఎంపిక చేయాలి, స్పీడ్ బౌలింగ్ ఎవరిని ఎంపిక చేయాలి. స్పిన్ బౌలింగ్ ఎవరైతే ప్రత్యర్థులను కట్టడి చేస్తారు. ఆడబోయే పిచ్ కు ఎలాంటి బౌలర్లు అవసరం అనే విషయాలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటది.
2024 ప్రపంచ కప్ T -20 జట్టును ఎంపిక చేసేటప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కొంత మేరకు విమర్శలు ఎదుర్కొన్నాడు. జట్టుకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసుకున్నాడు. అప్పుడు కొందరు రోహిత్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నలుగురు స్పిన్నర్లు అవసరమా అని కెప్టెన్ రోహిత్ శర్మ ను ప్రశ్నించారు.
ఎవరు ఏమి అన్నా రోహిత్ మాత్రం ఎదురు మాట్లాడలేదు. నవ్వుతూ, సున్నితంగా సమాధానం చెప్పేసాడు. ఏమని సమాధానం చెప్పాడంటే ….. ఆట మొదలయ్యాక మీరే చూస్తారు అని సుతిమెత్తగా చెప్పేశాడు. స్పిన్నర్లను ఎంపిక చేసుకొని ప్రతి ఆటలో రోహిత్ శర్మ వేసిన పాచిక విజయ వంతం అయ్యింది. T -20 ప్రపంచ కప్ సాధించడంతో కెప్టెన్ ఎంపిక సరైనదే అని తేలిపోయింది.