Guru Pournami : తల్లి దండ్రుల తరువాత స్థానం గురువుదే. ఈ విషయం హిందూ వేదంలో స్పష్టంగా చెప్పబడింది. జ్ఞానం, విద్య, అందించిన గురువును పూజిస్తారు. విద్యార్ధి దశలో గురువు చెప్పిందే వేదం. ఆ వేదం ద్వారా సమాజంలో నిలదొక్కుకుంటారు ప్రతిఒక్కరు. వ్యాసమహర్షి జన్మ దినం పురస్కరించుకొని ప్రతి హిందూ కుటుంబం గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఆ రోజు శిష్యులు తమ గురువులను పూజిస్తారు. ఈ ఏడాది గురు పౌర్ణమి ఏ రోజు వస్తుంది ? అందుకు సరైన ముహుర్తాన్ని వేద పండితులు ఈ విదంగా చెబుతున్నారు.
గురు పౌర్ణమి కి వ్యాస మహర్షి అనే పేరు కూడా ఉంది. ఇదే రోజున వ్యాసుడు జన్మించాడు. విష్ణు మూర్తి, లక్ష్మి దేవి కూడా వ్యాసుడిని పూజించారు. గురు పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం వలన వారి జీవితం ఏడాదంతా సుఖ సంతోషాలతో ఉంటుందని వేదంలో చెప్పబడింది.
2025 లో గురుపౌర్ణమి ముహూర్తం జూలై 9న మధ్యాహ్నం 1.36 గంటలకు మొదలై మరుసటి రోజు అనగా జులై పదో తేదీన మధ్యాహ్నం 2.06 గంటల కు ముగియనుందని వేద పండితులు చెబుతున్నారు.