Kannappa : గత పదేళ్ల నుంచి కన్నప్ప సినిమా కోసం ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు మంచు విష్ణు శ్రమంచినందుకు మంచి ఫలితం దక్కిందని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ నడుస్తోంది. సినిమాలో క్లెమాక్స్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం సాగుతోంది. మార్కింగ్ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.
కన్నప్ప సినిమాలో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు నటించారు. స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించడంతో సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలు అనుకున్న విదంగా నిజం కావడంతో చిత్ర బృందం ఆనందంలో ఉంది.
మొదటి భాగంలో బీజీఎమ్, కొన్ని సీన్స్ ప్రేక్షకులు, అభిమానులు ఆశించిన మేరకు లేవంటున్నారు. ఇంటర్వెల్ తరువాత దర్శకుడు ముకేశ్ కుమార్ ప్రేక్షకులు ఊహించనిరీతిలో తెరకెక్కించారు. ఇంటర్వెల్ కు ముందు యావరేజ్ గా ఉన్న సినిమా ఇంటర్వెల్ తరువాత అదిరిపోయిందంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ప్రధానంగా హీరో ప్రభాస్, మంచు విష్ణు నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందంటున్నారు ప్రేక్షకులు