Home » Singareni : సారు… కార్మికులను చిన్నచూపు చూసిండు

Singareni : సారు… కార్మికులను చిన్నచూపు చూసిండు

Singareni : సారూ… సింగరేణి బొగ్గు గని కార్మికులను చిన్న చూపు చూసిండు. అందుకే బొగ్గు అయిపోయిండు. ఒక్కనాడు కూడా కన్నెత్తి బొగ్గు బాయిలకెయ్యి చూడకపాయె. పట్టించుకున్న పాపాన లేకపాయె. ఒక్క ప్రయేట్ సార్ల సుట్టే తిరిగిండు. గాళ్ళతోనే మీటింగ్ పెట్టి సీఎం ను పిలిచి మాట్లాడిచ్చిండు. ఒక్క ప్రయేట్ సార్లు ఓట్లేత్తెనే గెలుత్తననుకున్నాడు. కానీ ఏమయ్యింది. బొగ్గు బాయిల కెయ్యి చూడలేదు. బొక్కబోర్లా పడ్డడు అంటూ సింగరేణి బొగ్గు గని కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గురించి గుసగుస పెట్టుకుంటున్నరు.

నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న ప్రాంతం నుంచి సింగరేణి కార్మికుల ఓట్లు ఎనిమిది వేలు. వారి కుటుంబ సభ్యులతో కలిపితే కనీసం ఇరువై వేల ఓటర్ల పైబడి ఉన్నారు. వీరందర్ని అభ్యర్థి ప్రభావితం చేయలేకపోయారనే ఆరోపణ కూడా సింగరేణి ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. కార్మికుల పక్షాన నిలబడే కార్మిక సంఘాలను కూడా అభ్యర్థి పట్టించుకోలేదని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన నరేందర్ రెడ్డి పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ ని కూడా పట్టించుకోలేదని ఆ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.

నరేందర్ రెడ్డి కేవలం పార్టీ నాయకులును, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల చుట్టు మాత్రమే ప్రదక్షణ చేయడం జరిగింది. వారిని మాత్రమే నమ్ముకొని బరిలో నిలిచారు. కానీ పరిస్థితి తారుమారైనది. శాసన మండలి దారి పడుతానని కళలుగన్న నరేందర్ రెడ్డి ఇంటిదారి పట్టక తప్పలేదు. నరేందర్ రెడ్డి ఓటమికి 5 వేల పైబడి ఓట్ల తేడాతోనే. కార్మిక వర్గాల్లో పార్టీ అనుబంధ సంఘం INTUC తో కలిసి ప్రచారం చేపడితే విజయం పక్కా ఉండేదని కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నరేందర్ రెడ్డి ఎవరినైతే నమ్ముకున్నారో, వాళ్లే నట్టేట ముంచారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *