vijayashanti : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ , ప్రముఖ నటి విజయ శాంతి ఇటీవలనే ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆమె ఎక్కడ కూడా నోరు మెదపలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లినప్పటికీ ఆమె మీడియా తో మాట్లాడలేదు. కానీ ఇటీవల జరిగిన ఒక సంఘటన పై ఆమెకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు ఒక శిక్షణ శిబిరంలో గాయాలపాలయ్యాడు. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా క్రిస్టియన్. కొడుకు క్షేమంగా రావడంతో ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకోడానికి తిరుమల రావడం జరిగింది. తిరుమల, తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకు ఆమె ఆలయ నియమాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యాన్నదానం కోసం 17 లక్షల రూపాయల విరాళం కూడా అందజేశారు. భక్తులతో కలిసి నిత్యాన్నాదనంలో పాల్గొన్నారు.
ఈ విషయాన్నీ కొందరు ఆకతాయిలు అన్నా లెజినోవా తీరుపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయి ఉండి తిరుమలకు రావడం ఏంటీ.. ? తలనీలాలు ఇవ్వడం ఏంటీ ? అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోల్స్ చేస్తున్న వారిపై తన అసహనం వ్యక్తం చేశారు. అన్నా లెజినోవాను ప్రశంసించారు. ఆలయ నిబంధనలను పాటించిన వ్యక్తిని అభినందించకుండా విమర్శించడం సరికాదన్నారు.