chiranjeevi : చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ముహూర్తం ఖరారైనది. హీరోగా చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందనున్న విషయం అభిమానులకు తెలిసిందే. గారపాటి సాహు, కొణిదెల సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈనెల 30న సినిమా షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
జూన్ నుంచి నిరవధికంగా సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సినిమా పూర్తిగా వినోదాన్ని అభిమానులకు, ప్రేక్షకులకు పంచనుంది. యాక్షన్ తో పాటు, కుటుంబ పరంగా కూడా కథను తీర్చి దిద్దనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించనున్నారు.
భారీ అంచనాలతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనున్నారు. తొందరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతి పండుగ రోజు విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.