Tea : ఉదయం నిద్ర లేవగానే టీ లేదంటే కాఫీ తాగుతారు. కొందరు కేవలం పాలు మాత్రమే తాగుతారు. ఇంటిలో సాధారణంగా స్టీల్ గ్లాస్, పింగాణీ కప్, సాసర్ లో టీ, కాఫీ, పాలు తాగుతాం. కానీ బయటకు వెళ్ళినప్పుడు హోటల్ లో కూడా టీ, కాఫీ తాగుతాం.
ఈ రోజుల్లో ఎక్కువగాస్టీల్, పింగాణీ కప్ లను హోటల్ వాళ్ళు వాడటంలేదు. పేపర్ గ్లాస్ మాత్రమే వాడుతున్నారు. పేపర్ గ్లాస్ వాడితే నిర్వహణ ఖర్చు ఉండదు. అందుకనే పేపర్ గ్లాస్ వాడుతున్నారు.
ఆరోగ్య నిపుణులు ఏ గ్లాస్ లో టీ, కాఫీ తాగితే మంచిదనే విషయాన్ని ఈ విదంగా చెబుతున్నారు. స్టీల్, పింగాణీ పాత్రల్లో తాగితే ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరగదని అంటున్నారు. పేపర్ గ్లాస్ లో తాగితే శరీరానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు.
వాటర్ఫ్రూఫింగ్ కోసం కాగితం కప్పులలో చాలా సన్నని ప్లాస్టిక్ పొర ఉంటుంది. దీన్నే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి పేపర్ గ్లాస్ లో కాఫీ, టీ తాగరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.