కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు కేసును అధికారికంగా ముగించింది.
విచారణ సందర్భంగా సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై, తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో కోర్టు కేసును క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, 2026 ఫిబ్రవరి 24న సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకోవడంతో ఈ కేసుకు తెరపడింది.

అయితే, సంగీత పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ పరిణామం సీఎం విజయ్‌కు ఊరటనిచ్చే అంశంగా రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

