NIGAMA MEDIA (P) LTD
6.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 7, 2026

ఆలస్యంగా అందిన సింగరేణి పెన్షన్లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

యూనియన్ బ్యాంకు ఖాతాల్లో జమ
అసోసియేషన్ నాయకులకు రిటైర్మెంట్ కార్మికుల కృతజ్ఞతలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి డివిజన్‌లోని సింగరేణి విశ్రాంత కార్మికులకు నవంబర్ నెల పెన్షన్ల చెల్లింపులో జాప్యం జరగడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి నెలా ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన పెన్షన్ ఈసారి స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే పంపించి, యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు పంపించకపోవడంతో రిటైర్మెంట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పండుగ ఖర్చులకు పెన్షన్ అందుతుందో లేదోనని శుక్రవారం వరకు ఆందోళనతో ఎదురుచూశారు. ఈ సమస్యను స్థానిక సింగరేణి రిటైర్మెంట్ కార్మిక సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, అసోసియేషన్ నాయకులు స్పందించి సీఎంపీఎఫ్ అధికారులు, జీఎం కార్యాలయ అధికారులు, యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరిపి పెన్షన్ల విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు. వారి ప్రయత్నాల ఫలితంగా శుక్రవారం రాత్రి యూనియన్ బ్యాంకు ఖాతాలకు పెన్షన్ నగదు పంపించడం జరిగింది.పెన్షన్లు జమ అయిన విషయం తెలుసుకున్న విశ్రాంత కార్మికులు అసోసియేషన్ నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల అసోసియేషన్ అధ్యక్షుడు వాసాల శంకర్ మాట్లాడుతూ, పెన్షన్ల విడుదలకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రతి నెలా ఒకటో తేదీనే విశ్రాంత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ అయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాల నాయకులు, కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. విశ్రాంత కార్మికులు తమ పెన్షన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె. రాజన్న, కంబాల రాజనర్సు, జక్కం రాజన్న, ఆసం కొమురన్న, పసునూటి నరసయ్య, సీహెచ్. గట్టయ్య, బి. భీమయ్య, తులాల ప్రభాకర్, శనిగారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.