విడాకుల కేసు ఉపసంహరించుకున్న సీఎం భార్య

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు కేసును అధికారికంగా ముగించింది. విచారణ సందర్భంగా సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై, తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో కోర్టు...