NIGAMA MEDIA (P) LTD
6.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, November 7, 2026

మధ్యాహ్న భోజన బియ్యం తరలింపుపై విద్యాశాఖ వివరణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

అక్రమ తరలింపు జరగలేదు..
శుభ్రపరిచేందుకే పక్కింటికి తీసుకెళ్లారు: డీఈఓ

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

మంచిర్యాల: జిల్లాలోని భీమిని మండల పరిధిలో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌ భీమిని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యాన్ని తరలించినట్లు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

మండల విద్యాశాఖాధికారి సమర్పించిన నివేదిక ప్రకారం.. నవంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పాఠశాలలో నిల్వ ఉన్న మధ్యాహ్న భోజన బియ్యాన్ని శుభ్రపరిచే ఉద్దేశంతో పక్కనే ఉన్న ఇంటికి తీసుకెళ్లినట్లు విచారణలో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బందిని సంబంధిత అధికారులు విచారించారు.

ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమ బియ్యం తరలింపు లేదా దుర్వినియోగం జరగలేదని మండల విద్యాశాఖాధికారి విచారణలో వెల్లడైనదని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ప్రకటించింది. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని విచారణలో తేలిందని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.