NIGAMA MEDIA (P) LTD
16.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 22, 2026

నిన్న రేషన్ కార్డు….నేడు ఫించన్ కార్డు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కొత్త పింఛన్లతో కాంగ్రెస్‌ ‘సంక్షేమ వ్యూహం’
రేషన్‌ కార్డుల తర్వాత పింఛన్లపై ఫోకస్‌
2.25 లక్షల మందికి లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాల విమర్శలకు రాజకీయంగానే సమాధానం ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాల అమలును విస్తరించడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా సామాజిక భద్రతా పింఛన్లపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షలకు పైగా సామాజిక భద్రతా పింఛన్లు అందుతున్నాయని, తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేర్కొంది.

కొత్త పింఛన్లకు సంబంధించి అర్హుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా జాబితాలను రూపొందించడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లను సంతృప్తికర స్థాయిలో అందించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.

సంక్షేమ పథకాలపై రాజకీయ ఫోకస్‌

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కీలక అంశంగా మారింది. ఆహార భద్రతలో భాగంగా 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో సామాజిక భద్రతా పింఛన్ల పరిధిని విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. రేషన్‌ కార్డులు, పింఛన్లు వంటి ప్రత్యక్ష ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ విధానాలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం లభించే అవకాశం ఉంది. దీంతో సంక్షేమ పథకాల అమలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ గత పాలనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న విమర్శలతో పాటు.. సంక్షేమ పథకాల అమలును ముందుకు తీసుకెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల సమస్యను పరిష్కరించామని ప్రభుత్వం చెబుతుండగా, తాజాగా కొత్త పింఛన్ల మంజూరుపై దృష్టి పెట్టింది.అర్హులైన వారికి పింఛన్లు అందితే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ప్రత్యక్ష ప్రభావం కనిపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ చర్యలు ఏ మేరకు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తాయన్నది రాబోయే కాలంలో లబ్ధిదారుల స్పందన, పథకాల అమలు తీరుపైనే ఆధారపడి ఉంటుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.