Collector : తెలంగాణ కలెక్టర్లు ఇటీవల విద్య, వైద్య శాఖలను నిత్యం తనికీ చేస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ అధికారులను సైతం తనికీ చేయాలంటూ ఆదేశాలు జారీచేస్తున్నారు. కలెక్టర్ల పర్యటనల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నూతనకల్ మండలం గుండ్ల సింగారంలోని అంగన్వాడి కేంద్రానికి వెళ్లారు.
కలెక్టర్ కు గౌరవంగా విద్యార్థులు నమస్కారం చేశారు. వచ్చినందుకు ఎదో ఒకటి తనికీ చేయాలి. కాబట్టి ముందుగా కలెక్టర్ ఒక్కొక్కరిని పేరు అడిగారు. విద్యార్థులు నిర్భయంగా తమ పేర్లు చెబుతున్నారు. ఇంతలో ఒక కుర్రాడు కలెక్టర్ ఆశ్చర్య పోయేవిధంగా తన మనసులో ఉన్న కోరికను చెప్పేశాడు.
కలెక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. ఈ అబ్బాయి ని పేరు అడిగితే నాకే షాకిచ్చాడు. అంటూ లోలోన అనుకున్నారు. ఇంతకూ ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే…. నన్ను ఒక్కసారి ఎత్తుకుంటే నా పేరు చెబుతా అంటూ చెప్పేశాడు. ఇంకేముంది కలెక్టర్ ఏమి ఆలోచించలేదు. ఆ అబ్బాయిని ఎత్తుకున్నారు. ఆ అబ్బాయి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.