Shiva : శివుడికి ఒకే ఒక్క ఆకుతోనే పూజ చేస్తారు. అది బిల్వపత్రి . ఇతర ఏ చెట్టు ఆకులతో కాకుండా కేవలం ఆ ఆకుతోనే పూజ ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి వేద పండితులు ఇలా చెబుతున్నారు.
శివుడికి మూడు కళ్ళు. అదే విదంగా చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడు కూడా బిల్వపత్రి ఆకులోనే కనబడుతాయని వేదంలో చెప్పబడింది. అందుకే భక్తికి ఈ మూడు ఆకులు ఉన్న బిల్వ పత్రీ ఒక గుర్తు.
బిల్వపత్రి భక్తిని సూచిస్తుంది. మంచి ఆలోచన, ఆకర్షణ కలిగి ఉంటుంది. శివుడికి కూడా ఖరీదయిన అలంకరణ అంటే ఇష్టం ఉండదు. అందుకే ఆయనకు మూడు ఆకులు ఉన్న బిల్వ పత్రి తో పూజ చేయడం అంటేనే ఇష్టం. భక్తులు కూడా నీటితో అభిషేకం చేసి, బిల్వ పత్రి పెట్టి పూజలు చేస్తారు. శివుడు కూడా తృప్తి చెందుతాడని వేదంలో చెప్పబడింది.