– హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం
– మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
– డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్
journalist : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పరిస్థితులు చాలా ఆవేదనకరంగా ఉన్నాయని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ వాపోయారు. గడచిన 15 రోజుల్లోనే నలుగురు జర్నలిస్టులు మృత్యువాత పడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటులో భాగంగా శనివారం అయన జిల్లా కేంద్రంలోని సీ-4 ఛానల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన యూనియన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ……
పత్రిక, మీడియా చానల్స్ యాజమాన్యాల లక్ష్యాలు, వేధింపులకు తాళలేక మానసిక ఒత్తిళ్లకు లోనై జర్నలిస్టుల మృత్యువాత పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల ఆత్మహత్యలపై స్పందించి ప్రత్యేక కార్యచరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గ విషయానికొస్తే జిల్లా కమిటీలు దాదాపు అన్ని మండలాలకు ప్రాతినిధ్యం తగ్గేలా చూస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పార్వతి రాజేష్ కుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర నాయకులు సిహెచ్ పరశురామ్, దుస్స శివప్రసాద్, ఈదునూరీ సారంగరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు.
నూతన జిల్లా కమిటీ……
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మంచిర్యాల జిల్లా నూతన అధ్యక్షులుగా పార్వతి సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బండ రవి గౌడ్ ను ఎన్నుకోగా కమిటీ సలహాదారులుగా బీరం రవి, మట్టే రవీందర్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా కనుకుంట్ల వెంకట రాజ్, అల్లంల కుమార స్వామి, మామిడాల రవీందర్, పినుమల్ల గట్టయ్య, కోశాధికారిగా డేగ ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శులుగా కంది రాజేష్, కొల్లూరి తిరుపతిని ఎన్నుకున్నారు.