Home » Congress : కాంగ్రెస్ @ 80….

Congress : కాంగ్రెస్ @ 80….

Congress : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో ఐదు రోజులపాటు మంతనాలు జరిపారు. అక్కడ ఒకవైపు మంతనాలు జరుపుతూనే, రాష్ట్రంలో చేరికలు సంభందించిన పావులు కదిపారు. ఆయన వచ్చి రావడంతోనే గులాబి పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సిలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంటే అధిష్టానం ఆశీస్సులతోనే చేరికల కార్యక్రమానికి తెరలేపినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 64 స్థానాల్లో విజయ పథకాన్ని ఎగురవేసింది. కంటోన్మెంట్కు జరిగిన ఉపఎన్నిక కూడా తన ఖాతాలో వేసుకోవడంతో అసెంబ్లీలో బలం 65 కు చేరింది. దశల వారీగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు చేరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలం 71 కి చేరింది. ఇంకా మరో తొమ్మిది మందిని చేర్చుకొని 80 కి చేరుకోవాలని రాజకీయ పరంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఇద్దరు. ఉమ్మడి కరీంనగర్ లో ఒకరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కొందరు చర్చలు జరుపు తున్నారు. ఇప్పటికే వీరందరూ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందిన స్థానం నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోండని డిల్లీ పెద్దలు ఆశీర్వదించి పంపినట్టు సమాచారం. ఒకవేళ ఎవరైనా పార్టీ విడుస్తామంటే ఆ సంగతి మేము చూసుకుంటామని హామీ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వచ్చే వారిని అడ్డుకుంటే వారంతా కాషాయం వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ బలపడుతుంది. రాబోయే రోజుల్లో ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బంది కరంగా తయారవుతుంది. కాబట్టి వచ్చే వారిని రానివ్వండి. ఒకవేళ అడ్డుకోవడం, వెళుతామనే సంకేతాలు ఇచ్చే వారి సంగతి మేము చూసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చి ఢిల్లీ పెద్దలు ఆశీర్వదించి సీఎం రేవంత్ రెడ్డిని పంపడంతోనే దూకుడు పెంచినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *