Home » Dy CM : Dy CM గా అక్బరొద్దీన్ ను చేస్తా …… సంచలనమైన సీఎం వ్యాఖ్యలు ….

Dy CM : Dy CM గా అక్బరొద్దీన్ ను చేస్తా …… సంచలనమైన సీఎం వ్యాఖ్యలు ….

Dy CM : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎక్కువగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడుతూ పాతబస్తీ కి మెట్రో రైలు కలగానే మిగిలిపోయిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో మెట్రో రైలు అదిగో, ఇదిగో అంటూ ఊరించారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిచారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీరు పదేళ్లు ఓపిక పట్టారు. మరో నాలుగేళ్లు ఓపిక పట్టమని కోరుతున్నా. అసెంబ్లీ సాక్షిగా పాత బస్తీ, చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో రైలు తీసుకు వస్తానని హామీ ఇస్తున్నా. చాంద్రాయణ గుట్ట వరకు మెట్రో రైలు తీసుకువస్తానని ఖచ్చితంగా చెబుతున్నా. మెట్రో తీసుకు వచ్చిన తరువాతనే అక్కడి ప్రజల ఓట్లు అడుగుతాను అంటూ సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు. పాతబస్తీకి మెట్రో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నిధులు మంజూరు చేశామని..భూసేకరణ కూడా పూర్తి అయిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగ సీఎం రేవంత్ రెడ్డి మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

చాంద్రాయణ గుట్ట నుంచి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని 2028 ఎన్నికల్లో గెలిపించాలని, అదేవిదంగా అక్బరుద్దీన్ ఒవైసీని కొడంగల్ లో 2028 లో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

ఈ సమయంలోనే మాట్లాడుతూ అక్బర్ ను ప్రతిపక్ష నేతగా కాకుండా… డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది తన హామీ అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆ విదంగా సీఎం మాట్లాడే సరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి అంతరంగం ఏమిటో అర్థం కాలేదు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *