Yoga : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో 2025, ఫిబ్రవరి 23న రాష్ట్ర స్థాయి యోగ పోటీలను నిర్వహిస్తున్నామని డ్రీమ్ యోగ అండ్ ఫిట్ నెస్ సొసైటీ వ్యవస్థాపకులు ముల్కల్ల శంకర్, ముల్కల్ల సాయి తేజ తెలిపారు. ఆరు నుంచి 70 ఏళ్ల లోపు వయసు గల వారు ఈ పోటీలో పాల్గొనుటకు అర్హులు. ప్రతి అంశంలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పోటీ ఉంటుంది. ప్రతి పోటీకి రాష్ట్ర స్థాయి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నామని పోటీల నిర్వహకులు తెలిపారు.
స్త్రీ, పురుషులకు వేరువేరుగా పోటీలను నిర్వహిస్తున్నామని పోటీలలో భాగంగా యోగ పోటీలల్లో 14 గ్రూప్ లు ఉంటాయన్నారు. యోగ పోటీలతో పాటు సూర్యనమస్కారములు, ఓపెన్ ఛాలంజ్ పోటీలో యోగ పుత్రిక, పుత్ర అవార్డు పోటీలు, యోగ అంశంపై ఉపన్యాసం పోటీ లను నిర్వహిస్తున్నామని ముల్కల్ల శంకర్ తెలిపారు.
ఇరువై మంది యోగ గురువులు న్యాయనిర్ణేతలుగా ఈ పోటీల్లో వ్యవహరిస్తారు. పోటీల్లో పాల్గొనే వారు తమ వెంట ఆధార్ కార్డు తో పాటు వయసుకు సంబందించిన ఏదేని దృవీకరణ పత్రం, దుప్పటి లేదా చాప తీసుకొని రావాల్సిందిగా పోటీల నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం 9912834566, 7981313770 మొబైల్ నంబర్లను సంప్రదించాల్సిందిగా వారు కోరారు.