IFTU : భారత దేశపు మేధావిని అవమానించిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వెంటనే తన మాటలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు సిపిఐ(ఎం ఎల్) న్యూ డెమోక్రసీ. IFTU అద్వ్యర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా చేసిన వాఖ్యలను సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, ఐఎఫ్ టీయు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం దళితుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప మేధావిని అవమానించడం సమంజసం కాదన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తి పై అమిత్ షా ఇలాంటి మాటలు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే కేంద్ర హోం మంత్రి సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.ఈ ధర్నా లో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, సిపిఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ. IFTU నాయకులు, కార్యకర్తలతో పాటు, సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి ఈ. నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.