House tax in SCCL : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు యాజమాన్యం శుభవార్త ప్రకటించిందని కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సింగరేణి కార్మికులు తమ సొంతింటి కల నెరవేరడానికి వివిధ బ్యాంకుల ద్వారా ఋణం తీసుకున్నారు. ఇల్లు కట్టుకోడానికి, లేదంటే కట్టిన ఇల్లు కొనుగోలు చేయడానికి ఋణం తీసుకున్నవారు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్నీ సింగరేణి డైరెక్టర్ ఫా మరియు ఫైనాన్స్ జి.ఎం ల దృష్టికి తీసుకెల్లి గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో చర్చించామని సీతారామయ్య తెలిపారు.
గతంలో కార్మికులు ఇంటి కోసం బ్యాంకులల్లో ఋణం తీసుకున్నారు. తీసుకున్న రుణంపై యాజమాన్యం ఏడాదిలోపు వరకు మాత్రమే వడ్డీ చెల్లించింది. ఆతరువాత కాలానికి కార్మికులే వడ్డీ చెల్లించుకున్నారు. యాజమాన్యం చెల్లించకపోవడంతో కార్మికులపై ఆర్థికంగా భారం పడిందని సీతారామయ్య సింగరేణి డైరెక్టర్ ఫా మరియు ఫైనాన్స్ జి.ఎం దృష్టికి వివరించారు. అదేవిదంగా పలువురి కార్మికులకు బ్యాంకు అధికారులు 8.33 శాతం వడ్డీ విదిస్తే, యాజమాన్యం 6 నుంచి 7 శాతం మాత్రమే చెలించడంతో కార్మికులు ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్నీ కూడా అధికారులకు వివరించడంతో వారు వెంటనే స్పందించి కొత్త నిబంధనలతో కూడిన సర్క్యులర్ ను అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ లకు ఆదేశాలు జారీ చేశారని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య తెలిపారు. కొత్త సర్క్యులర్ నిబంధనల ప్రకారం
ఇల్లు కట్టుకున్న లేదా కొనుక్కున్న తరువాత ఎప్పుడైనా బ్యాంకు ఋణం తీసుకున్న కార్మికులకు కూడా వడ్డీ చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. అదేవిదంగా తక్కువ వడ్డీకి రుణాలు తీసుకున్న వారికి కూడా 8.33 శాతం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ సర్కులర్ జారీ చేసిందని సీతారామయ్య వివరించారు. ఈ అవకాశాన్ని కార్మికవర్గాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అయన కోరారు.
ఈ సందర్బంగా ఇంటి ఋణం తీసుకున్న కార్మికులకు ఆర్థిక భారం తగ్గించడానికి కృషి చేసినందుకు యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్యను కార్మిక వర్గాలు, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.