Cm Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భాద్యతలు. మరోవైపు పీసీసీ భాద్యతలు. పదేళ్ల తరువాత అధికారంలోకి పార్టీని తీసుకొచ్చిన నాయకుడిగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద గుర్తింపు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు. రెండు భాద్యతలు మోస్తున్న సీఎం రేవంత్ రెడ్దకి ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. తనతో సమానంగా నడిచే నాయకుడు పార్టీ కి అవసరం. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొవాలి. అంతే కాదు పార్టీ శ్రేణులకు కూడా అందుబాటులో ఉండాలి.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ లో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడి నియామకం తో పాటు, మంత్రి వర్గ విస్తరణ, కార్పోరేషన్ పదవుల పంపకం పనులు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నిటి అనుమతుల కోసం సీఎం ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు కూడా వెంట ఉన్నారు.
పీసీసీ పదవి ఎవరికి కేటాయిస్తే న్యాయం జరుగుతుందో అనే విషయాన్నీ కూడా సీఎం ఢిల్లీ అధిష్టానం కు ఈ పాటికే చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. అందుకు గల కారణాలను కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కు కూడా వివరించారని సమాచారం. డిప్యూటీ సీఎం, తో పాటు పలువురు మంత్రులు కూడా తమ మద్దతు దారుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిదంగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ త్యాగం చేసిన నాయకులు కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మంత్రి పదవుల పంపకం ఆశించే స్థాయి ఎమ్మెల్యేల సంఖ్య కూడా బాగానే ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవుల కేటాయింపు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డికి కఠినమైన పరీక్ష. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ నియామకం, మంత్రి పదవుల కేటాయింపు, కార్పొరేషన్ పదవుల పంపకం చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదంటే బ్రేక్ వేస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు పనిచేయాలంటే ఈ మూడింటిని భర్తీ చేయాలి. అప్పుడే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.