2018 లో 36 మంది మావోయిస్టులు
2021 లో 26 మంది మృతి
2024,ఏప్రిల్ 16న 29 మంది హతం
మావోయిస్టుకు కోలుకోలేని పెద్ద దెబ్బ
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ప్రత్యేక పోలీస్ బలగాలకు,నిషేదిత మావోయిస్టు గ్రూప్ సభ్యులకు ఇప్పటివరకు అనేకంగా ఎదురు కాల్పులు జరిగాయి.గతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు,ముగ్గురు జరిగిన సందర్భాలు ఉన్నాయి.జరిగిన ఎన్కౌంటర్లలో అధికంగా మావోయిస్టు సభ్యులు చనిపోయి నష్టపోయారు.పోలీసులు పైచేయి సాధించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ గట్టి పట్టుమీద ఉంది.ఏవిదంగానైనా ఆ రాష్ట్రంలో ఉనికి లేకుండ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధికి అడ్డుగోడగ నిలిచిన మావోయిస్టు పార్టీ ఆనవాళ్ల్లు లేకుండా చేయాలనే పట్టుదలతో కేంద్ర హోమ్ శాఖ ఉంది.ఇందుకు అనుగునంగా ప్రత్యేక బలగాలు ఆ రాష్ట్రంలోని అడవులను జల్లెడ పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగయిన పోలింగ్ సాధించాలనే పట్టుదలతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది.అందుకు తగినవిదంగా ప్రత్యేక బలగాలను మారుమూల ప్రాంతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పంపింది.పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం చూపించి తమ సత్తా ఏమిటో చూపించాలని మావోయిస్టు పార్టీ ఎంచుకొంది. ఈ నేపథ్యంలోనే గాలింపు చేపడుతున్న పోలీస్ బలగాలకు మావోయిస్టులు సమావేశమైన ప్రాంతం దొరికింది. ఈ ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు చనిపోవడం ఎన్కౌంటర్ చరిత్రలో మూడో అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు.
మూడో అతిపెద్ద ఎన్కౌంటర్ ….
మహారాష్ట్ర లోని గడ్చిరోలి ప్రాంతం బామ్ర ఘడ్ తాలూకాలోని కషన్ సూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక పెళ్ళికి మావోయిస్టు సభ్యులు వస్తున్నారనే పక్కాసమాచారం రావడంతో భద్రత బలగాలు కాపుకాశాయి.ఇరువర్గాలకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్ భద్రతా దళాల చరిత్రలోనే అతిపెద్దై కావడం విశేషం. ఈ ఎన్కౌంటర్ లో పలువురు కీలక నేతలు చనిపోవడంతో పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.అదేవిదంగా గడ్చిరోలి జిల్లా కోట్ గుల్ మర్దన తోట అటవీ ప్రాంతంలోని కోర్చి ప్రాంతంలో 2021,నవంబర్ 14 న జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు.ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడితోపాటు పాటు కొందరు కీలక నేతలు కూడా చనిపోయారు. ఈ రెండు ఎన్కౌంటర్ ల తరువాత మంగళవారం కాంకేర్ అడవుల్లో జరిగిన సంఘటన మూడో అతిపెద్ద ఎన్కౌంటర్.ఇందులో కూడా కీలకనేతలను పార్టీ కోల్పోవడం జరిగింది.
మావోయిస్టుకు ఎదురుదెబ్బలు……
ఏ ప్రాంతమైతే సురక్షితమని మావోయిస్టు పార్టీ అనుకున్నదో, ఆ ప్రాంతమే రక్షణలేకుండా పోయింది. బస్టర్,కాంకేర్,గడ్చిరోలి,బాంరఘడ్, కాసంసూర్ ప్రాంతాలను తలదాచుకోడానికి ఎంపిక చేసుకొంది.ఇప్ప్పుడు ఆ ప్రాంతాల్లో భద్రత బలగాలు పూర్తిగా పట్టుసాధించాయి.మారుమూల పల్లెల్లో పాగా వేసి గిరిజనులను తమవైపు తిప్పుకోవడంతోనే బలగాలు పట్టు సాదించాయనే అభిప్రాయం వచ్చిందిపోలీస్ బలగాలు పైచేయి సాధించాయి.పార్టీ ఎదుగుదలతోపాటు,ఆశ్రయం కూడా సురక్షితంగా ఉంటుందని బావించి పట్టు సాధించుకొన్న పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.ఆ ప్రాంతంలో సగటున రోజుకు ఒకరైన ఎదురుకాల్పుల్లో చనిపోవడంతో పార్టీ పరిమాణం తగ్గిపోతోంది.వరుసగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగలడంతో ఆ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి పూర్తిగా ఎదురుదెబ్బలకే పరిమితమైనదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమవుతున్నాయి.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-