T -20 : దక్షణాఫ్రికా జట్టు ఆటగాళ్లు విజయం మనదే అనే ధీమాలో పడిపోయారు. సంబరాలకు సిద్ధమవుతున్నారు. పొట్టి ప్రపంచ క్రికెట్ కప్ మనదే అనే ధీమాలో ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఆరు వికెట్లు ఇంకా ఉన్నాయి. ముప్ఫయ్ బంతుల్లో ముప్ఫయ్ పరుగులు చేస్తే కప్ వాళ్ళ సొంతం అవుతుంది. కానీ అప్పటికే క్లాసేన్, మిల్లర్ మంచి ఊపులో ఉన్నారు.
దక్షణాఫ్రికా శిబిరంలో ఆనందం. భారత శిబిరంలో నిరాశ. కానీ రోహిత్ సేన పట్టువదలని విక్రమార్కుడిలా జట్టును ముందుకు నడిపించింది. కప్ ను సాధించడమే లక్ష్యముగా బౌలర్లు తమ బంతికి పదును పెట్టారు. ఐదు ఓవర్లను అవకాశముగా తీసుకున్నారు. అందివచ్చిన అవకాశాన్ని చేజారకుండా ఆడారు. విజయం అసాధ్యం అనుకున్న దాన్ని సాధించి చూపారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ముద్దాడారు.
పదహారో ఓవర్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థులను కట్టడి చేశాడు. బుమ్రా తరువాత హార్థిక్ బంతిని అందుకున్నాడు. హర్హిక్ వేసిన తోలి బంతికే క్లాసిన్ ఔట్ కావడం విశేషం. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉన్నాయి. లక్ష్యం 22 పరుగులు. ఇండియా జట్టులో ఆశలు చిగురిస్తున్నాయి. మల్లి బుమ్రా రంగంలోకి దిగి కేవలం రెండు పరుగులే ప్రత్యర్థికి ఇచ్చాడు. దింతో దక్షిణాఫ్రికా జట్టు రెండు ఓవర్లు మాత్రమే ఆడాలి. ఇరవై పరుగులు లక్ష్యం. 19 వ ఓవర్లో హర్షదీప్ బంతిని పట్టాడు.
హర్ష బౌలింగ్ లో కేవలం నాలుగు పరుగులే దక్కాయి. దింతో టీ 20 వరల్డ్ కప్ ఇండియా ఇంటికి చేరుతున్నట్టు అనిపించింది. ఆరు బంతుల్లో పదహారు పరుగులు చేయాల్సిన జట్టుకు చెమటలు పడుతున్నాయి. దూకుడుగా ఆడుతున్న మిల్లర్ ఆటను సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో ఇండియా జట్టు విజయానికి దగ్గరకు చేరింది. చివరగా మిగిలిన రెండు బంతుల్లో పది పరుగులు చేయాలి. కానీ ఐదో బంతికి కూడా రబాడ అవుట్ కావడంతో భారత జట్టు ప్రపంచ విజేతగా నిలిచి టీ 20 ప్రపంచ కప్ ను అందుకొంది.