Cricket IPL : 2024 IPL క్రికెట్ మ్యాచ్ లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. తమ అభిమాన క్రీడాకారుల బ్యాటింగ్,బౌలింగ్ చూసి మురిసిపోతున్నారు. సిక్స్ లు, ఫోర్ లతో బౌండరీలు దాటిస్తుంటే స్టేడియంలు దద్దరిల్లిపోతున్నాయి. మొత్తం 68 మ్యాచ్ లు జరగాలి. 51 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా 17 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి జరిగిన 51 మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు ఎంత మంది చూశారని ఇటీవల సర్వే కూడా జరిగింది. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 51 మ్యాచ్ లను 51 కోట్ల మంది క్రికెట్ అభిమానులు చూసినట్టు ప్రకటించింది. ఇది గత మ్యాచ్ లతో పోలిస్తే తాజా IPL మ్యాచ్ లను చూసిన వారి శాతం 18 శాతం అదనంగా పెరిగినట్టు బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
కోల్కత్తా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ లల్లో గెలుపొందాయి. ఆ రెండు జట్లు రెండు స్థానాల్లో నిలిచాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వీటితోపాటు లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్, చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్లు పోటా, పోటీగా ఆడి 12 పాయింట్లు సాధించాయి. ఈ మూడు జట్లు వరుసగా 4,5,6, స్థానాలను దక్కించుకొని తమ అభిమానులకు విజయాన్ని అందించాయి.