యువతకు అండగా పోలీస్ శాఖ
చదువుతోనే యువతకు భవిష్యత్తు
బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
Police : యువతకు తమ పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అదే విదంగా యువత కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ కోరారు. ఆదివారం బెల్లంపల్లి సబ్-డివిజన్, మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి హై స్కూల్ మైదానంలో మందమర్రి పోలీసులకు, జర్నలిస్టులకు స్నేహపూర్వక క్రికెట్ పోటీ జరిగింది. ఈ పోటీలో పోలీస్ జట్టు విజయం సాధించగా, జర్నలిస్ట్ జట్టు రన్నర్ గా నిలిచింది. పోలీస్ జట్టు 111 పరుగులు సాధించగా, జర్నలిస్ట్ జట్టు 110 పరుగులతోనే సరిపెట్టుకొంది. ఈ సందర్బంగా విజేతలకు ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి బహుమతులు అందజేశారు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కు ఎస్సై రాజశేఖర్ ఎంపికయినారు. ఈ సందర్బంగ ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ……
మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వారితో పాటు, వారికి ఆశ్రయం ఇస్తున్న వారికీ, వినియోగిస్తున్న వారికి చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత సాధించేదంటూ ఏమి లేదన్నారు. కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, వాటిని వాడుతున్న వారి ఆయుస్సు కూడా అర్ధాయుస్సే అవుతుందని ఏసీపీ ఈ సందర్బంగా స్పష్టం చేశారు.
మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ యువత చదువు కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చదువుతోనే యువత, వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాయన్నారు. యువతకు ఎలాంటి అవసరం వచ్చిన మమ్మల్ని సంప్రదిస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ మాట్లాడుతూ, “మాదకద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే యువత ఈ వ్యసనాల బారిన పడటం భవిష్యత్‌ను ప్రమాదంలో పడేస్తోందన్నారు. డ్రగ్స్ వలలో చిక్కుకున్న వారు కోలుకోవడం చాలా కష్టతరమన్నారు.