Bibipeta : తెలంగాణ రాష్ట్రంలో భాద్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధికే కట్టుబడి ఉందని బిబిపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మలుగారి మహేష్ స్పష్టం చేశారు. సోమవారం మహేష్ బీబీపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతి, యువకుల అభివృద్ధి కోసమే రాజీవ్ యువ వికాసం పథకాన్ని పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ యువత ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఎన్నడూ పట్టించుకోలేదని, అదేవిదంగా ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టలేదని ఆయన ఈ సందర్బంగా ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలోనే 55 వేళా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. నిరుద్యోగ భృతి హామీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైనదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మహేష్ ఈ సందర్బంగా కోరారు. ఆయనతో పాటు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.