India : భారత దేశం పరిపాలన అంతా ప్రధాన మంత్రుల చేతుల్లోనే ఉంటుంది. దేశాభివృద్ధి కి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. దింతో భాద్యతలు చేపట్టిన ప్రధాన మంత్రులు కొంత మోదం, కొంత ఖేదం ఎదుర్కొంటారు. దేశ ప్రధానుల్లో జవహర్‌లాల్ నెహ్రూ 6,130 రోజులు, ఇందిరా గాంధీ 4,077 రోజులు పరిపాలించారు. ప్రస్తుత ప్రధాని మోదీ భాద్యతలు చేపట్టి 4,078 రోజులు దాటింది. అంటే ఇందిరా గాంధీ కంటే ఎక్కువ. కానీ నెహ్రు రికార్డును దాటి పోవడం మోదీ కి బీజేపీ సిద్ధాంతం ప్రకారం కష్టమే అంటున్నారు రాజకీయ శ్రేణులు.
ఇందిరా గాంధీ పరిపాలనతో పోలిస్తే మోదీ కి అంత పేరు వస్తుందా అంటే కష్టమే అంటున్నారు రాజకీయ మేధావులు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఈ ఇద్దరి ప్రధానులు పరిపాలన మధ్య కొన్ని పోలికలు కనబడుతున్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో అమెరికాను ఏ మాత్రం ఇందిరా గాంధీ పట్టించుకోలేదు. కానీ మోదీ మాత్రం అమెరికా మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ కు అంగీకరించారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇందిరా గాంధీ హయాంలో ఏం జరిగిందనేది నేటి తరానికి అంతగా తెలియదు. ఆమె పరిపాలన పరంగా ఎవరికీ తలవంచలేదు. అందుకే ఆమెను ఉక్కు మహిళా అంటారు. ఆమె నిర్ణయాలు అంత బలంగా ఉండేవి. ఆమె రాజకీయ నిర్ణయాలపై అనేక విమర్శలు సైతం ఉన్నవి. కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చడంలో రాజ్యాంగాన్ని దిక్కరిస్తారు అనే పేరు కూడా ఉంది. అందుకు ఆమె ప్రతిఫలం కూడా అనుభవించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ఘోరమైన ఓటమిని మూటగట్టు కున్నారు. ఎన్నికల్లో ఆమె కూడా పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఎన్నికల్లో భారీ విజయం సాధించి గద్దెనెక్కారు.
ఇందిరా గాంధీ కంటే మోదీ ఎక్కువ కాలం బాధ్యతల్లో ఉంటున్నారు. కానీ పరిపాలన పరంగా క్లిష్టపరిస్థితుల్లో ఆమె తీసుకున్న నిర్ణయాలతో పోలిస్తే మోదీనే ఆమె కంటే కొంత మేరకు వెనుకబడి ఉన్నారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవు తున్నాయి. పరిపాలన పరంగా ఇందిర పరిపాలనలో పరిస్థితులు వేరు. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు వేరు. పరిస్థితుల ఆధారంగా బాధ్యతల్లో ఉన్నవారు ప్రజల అభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానిగా ఇప్పుడు ఇందిరా గాంధీ ఉంటె కూడా మోదీ మాదిరిగానే నిర్ణయాలు తీసుకునే వారంటున్నారు రాజకీయ పండితులు.