Home » Mavoist : లొంగిపోయిన మావోయిస్టు చీఫ్ దేవ్ జీ

Mavoist : లొంగిపోయిన మావోయిస్టు చీఫ్ దేవ్ జీ

మావోయిస్టుకు ఎదురు దెబ్బ
కుప్పకూలిన వ్యవస్థ

Mavoist : కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి (62) తెలంగాణ ప్రభుత్వం వద్ద లొంగిపోయారు. ఇందుకు పోలీస్ శాఖ ద్రువీకరించాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ అడవుల్లో రెండు రోజుల కిందట లొంగిపోయినట్టుగా సమాచారం. అతనితో పాటు మరో పదిహేను మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అందులో కొందరు పార్టీ పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీ సభ్యల వంటి కీలక నేతలు కూడా ఉన్నట్టు సమాచారం.

21 మే ,2025న అబూజ్ మడ్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. అయన తరువాత పార్టీ దేవ్ జీ ని పార్టీ చీఫ్గా నియమించినట్టుగా ప్రచారం జరిగింది. పార్టీలో దేవ్ జీ ని కొమ్ము దాదా, సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్న అనే పేర్లతో పిలుస్తారు. తెలుగు భాషతో పాటు హిందీ, గోండు భాషల్లో మంచి ప్రావిణ్యం ఉంది. పార్టీ సైనిక్ విభాగంతో పాటు, మిలిటరీ కమిషన్ భాద్యతలను కూడా అదనంగా దేవ్ జీ నిర్వహిస్తున్నారు. అధికార ప్రతినిధి అభయ్ పేరుతొ
పత్రిక ప్రకటనలు ఇచ్చేది కూడా దేవ్ జీ అని అంటారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినట్టు రికార్డుల్లో ఉంది. 2010 లో దంతెవాడ లో పోలీస్ బలగాలపై దాడి చేసి 74 మంది మృతికి ప్రధాన కారకుడిగా రికార్డుల్లో ఉంది.

తెలంగాణ రాష్ట్రము ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ కాలానికి చెందిన దేవ్ జీ ది వ్యవసాయ కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు, ఒక ఒక్క. సంతానంలో దేవ్ జీ పెద్దవాడు. కోరుట్లలో ఇంటర్ చదువుతున్నప్పుడే రాడికల్ స్టూడెంట్ యూనియన్ కళాశాల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల్లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే 1980 లో అడవి బాట పట్టాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి తరువాత భాద్యతలు చేపట్టిన బసవరాజు ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. ఆయన తరువాత దేవ్ జీ భాద్యతలు చేపట్టారు. పార్టీ నిర్మాణంలో ప్రధాన కార్యదర్శి హోదాలో లొంగిపోయిన మొదటి వ్యక్తి దేవ్ జీ కావడం విశేషం. పార్టీ చీఫ్ భాద్యతలు చేపట్టిన గణపతి, దేవ్ జీ ఇద్దరు కూడా ప్రస్తుత జగిత్యాల జిల్లా వాసులే కావడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *