Singareni : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు సీఐటీయూ నాయకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ లో CITU మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు సంకే రవి , సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడాతూ ……
కేంద్ర కార్మిక సంఘాలైన CITU,AITIC,INTIC,HMS, మరియు ప్రాంతీయ సంఘాలు IFTU,(BRS)(KV) రైతు,కూలీ సంఘాల సంయుక్త కమిటీల ఆధ్వర్యంలో ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చినట్టు వారు తెలిపారు. ఉద్యోగుల, కార్మికుల చట్టబద్దమైన హక్కులను రద్దు చేసి ఎలాంటి ప్రయోజనం లేని 4 లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సింగరేణి సంస్థను కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వారు ఆరోపించారు.
ఈ ఒక్క రోజు సమ్మెలో అన్నివర్గాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో SCEU యూనియన్ రాష్ట్ర నాయకులు మెండే శ్రీనివాస్, శ్రీరాంపూర్ బ్రాంచి నాయకులు కస్తూరి చంద్ర శేఖర్,వెంగల శ్రీనివాస్, శ్రీపతి భానేష్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

by