కోల్ ఇండియాలో బంగారు పథకం
ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
Singareni : ఒకవైపు ఉద్యోగ భాద్యతలు. మరోవైపు కళారంగంలో కళాకారుడిగా ప్రతిభ. అక్కడితో ఆగకుండా కళాకారుడిగా పరిశోధన. ఇంకోవైపు కుటుంబ భాద్యతలు. ఇన్ని భాద్యతలను మోస్తూనే పట్టుదలతో తనకు ఇష్టమైన కళారంగంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన సింగరేణి గని కార్మికుడిని పలువురు అభినందిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్ ఏరియా SRP 3 & 3A గనిలో నీలాల శ్రీనివాస్ జనరల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో అంతడుపుల నాగరాజు బృందంతో కలిసి శ్రీనివాస్ సంస్కృతి కార్యక్రమాలు, ధూం దాం కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు కృషి చేశారు. సింగరేణి సంస్థ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించారు.
ఇటీవల నాగపూర్ లో నిర్వహించిన కోల్ ఇండియా స్థాయి కల్చరల్ విభాగంలో పాల్గొని శ్రీనివాస్ తన ప్రతిభను చాటారు. దింతో శ్రీనివాస్ కోల్ ఇండియా స్థాయి బంగారు పథకాన్ని అందుకున్నారు. ఇటీవల పాండిచ్చేరిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నిర్వహించిన సెమినార్ నుండి ఫైన్ ఆర్ట్స్ ఫోక్ డాన్స్ నుండి నీలాల శ్రీనివాస్ డాక్టరేట్ పట్టా తో యూనివర్సిటీ సత్కరించింది.
ఈ సందర్బంగా నీలాల శ్రీనివాస్ మాట్లాడుతూ జానపదం నా ప్రాణపదం -జన జాగృతికే అంకితం అనే నినాదం తో కళారంగంలో సేవలందిస్తానన్నారు. తనకు ఎల్లవేళలా అండగా ఉంటూ, ఈ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేసిన వెంకట రమణకు, గురువయ్య కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ పట్టా పొందిన నీలాల శ్రీనివాస్ ను ఈ సంధర్బంగా గని అధికారులు, సూపెర్వైజర్లు, కార్మికులు, వివిధ యూనియన్ నాయకులు అభినందించారు.

by