kcr and jagan : రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఓటమి చెందారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఆ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఛాలంజ్ చేస్తున్నారు. సవాల్ విసురుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వైసీపీ, బిఆర్ఎస్ నాయకుల మాటలు చాల విచిత్రంగా వినబడుతున్నాయి. ఎవరు, ఎవరిని అనుసరిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. బిఆర్ఎస్ పార్టీ వైసీపీని అనుసరిస్తున్నదా ? లేదంటే వైసీపీ బిఆర్ఎస్ ను అనుసరిస్తున్నదా అనేది అర్థం కావడం లేదు రెండు రాష్ట్రాల ప్రజలకు .
తెలుగు దేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసిన కేసులో అరెస్టు అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే. టీడీపీ మాదిరిగానే మేము కూడా అరెస్టు చేస్తాం. అప్పుడు మీకు జైళ్లు కూడా సరిపోవంటూ హెచ్చరించారు. ఇది విన్న ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారం చేపట్టి కూటమి ప్రభుత్వం ఏడాది కూడా కాలేదు. అప్పుడే హెచ్చరికలు ఏమిటి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడిన మాటలు విచిత్రంగానే ఉన్నాయి. అరికపూడి గాంధీ– కౌశిక్ రెడ్డి వివాదం తెలిసిందే. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది మా బిఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు మా తడాకా చూపిస్తాం. అరెకపూడి గాంధీకి తామేంటో కూడా చూపిస్తాం అని వైసీపీ నేతలు హెచ్చరిక చేశారు.
వచ్చేది మా ప్రభుత్వం, అప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ బిఆర్ఎస్ , వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ వరకు బాగానే ఉన్నవి. ఒకవేళ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్లకు కూడా తెలుసనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.