Politics : ఎదుటి వారిని గౌరవించాలి. వారితో మర్యాదగా మాట్లాడాలి. వారు గౌరవించకపోయినా పరవాలేదు. కానీ ఎదుటివారిని గౌరవించడం సంస్కారం అవుతుంది. అప్పుడే ఎదుటివారి శక్తి,, సామర్ద్యాలు ఎంత అనేది తెలిసిపోతుంది. తనకంటే గొప్పోళ్ళు ఎవరూ ఉండరని, నేనే తెలివిగలవాణ్ణి, ఒంటినిండా అహంకారంతో ఉన్న వారికి నోటికి ఏ మాట వస్తే అదే మాట్లాడుతారు. ఇలా ఓటమిని జీర్ణించుకోలేక, ఎదుటివారి హోదాకు గౌరవం ఇవ్వక నోరు అదుపులో పెట్టకుండా మాట్లాడిన గులాబీ నేతలకు ఇప్పటికయినా రాజకీయ పరిస్థితులు అర్ధమై ఉండాలి.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవస్థను నడిపించారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం ఆయనను రాష్ట్ర నేతగా అంగీకరించరు. ప్రత్యర్థి విజయాన్ని ఒప్పుకోరు. తమదే గొప్ప బలమంటారు. తమను తాము బలవంతులుగా చెప్పుకుంటారు. వీటన్నిటిని పక్కకు పెట్టి ప్రజల్లోకి వాస్తవాలతో వెళ్ళినప్పుడే గులాబీ పార్టీకి చెప్పుకోదగిన రోజులు ఎదురుగ ఉంటాయి.
సీఎం రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టిన నాటి నుంచి బిఆర్ఎస్ ప్రధాన నేతలతో పాటు, కేటీఆర్, హరీష్ రావ్ లు ఎన్ని మాటలు అనాలో అన్ని అనేశారు. ఓరి పొట్టోడా అంటూ వ్యంగంగా పబ్లిక్ మీటింగ్ లో అనడానికి కూడా ఏమి ఆలోచించలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ తొందరపడలేదు. నోటితో సమాధానం చెప్పలేదు. ప్రజలతో సమాధానం చెప్పించారు. మున్సిపల్ ఎన్నికలే అందుకు తార్కాణం.
రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో మునుపటి బలం ఇప్పుడు లేదు. అంతే కాదు నిజామాబాద్ లో శూన్యం. అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రామ ప్రాంచాయితి ఎన్నిక, మున్సిపాలిటీ ఎన్నిక ఏదయినా విజయం రేవంత్ రెడ్డిదే అవుతోంది. అయినా నోటి దురుసు తగ్గడంలేదు. రేవంత్ రెడ్డి ఎత్తులకు, పై ఎత్తులు వేసి పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే కేటీఆర్, హరీష్ రావ్ ల ముందు ఉన్న అసలు సమస్య.. లేదంటే యుద్ధంలో ఆయుధం విడిచిన వారు, జనంలో నోరు జారిన వారి తో గులాబీ నేతలు సమానం కావడం ఖాయం.

by