Home » Singareni : సింగరేణి సి & ఎండీ ని కలిసిన గుర్తింపు సంఘం

Singareni : సింగరేణి సి & ఎండీ ని కలిసిన గుర్తింపు సంఘం

Singareni : ఇటీవల భాద్యతలు చేపట్టిన సింగరేణి కాలరీస్ కంపెనీ సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి ని హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా చైర్మన్ ను ఏఐటీయూసీ నాయకులు సన్మానించారు.

ఈ సందర్బంగా చైర్మన్, యూనియన్ నాయకులు ఉత్పత్తి, ఉత్పాదకత, సంస్థ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో నిర్మించాల్సిన కొత్త గనుల పై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కే వీరభద్రయ్య,, వైవి రావు, ముస్కే సమ్మయ్య , మడ్డి ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *