బిబిసిలో ఉద్యోగం కోసమా..?
ఆప్షన్లు అక్రిడిటేషన్ల కోసమా?
నిబంధనలపై నోరు విప్పని సంఘాలు
రేషన్ కార్డు కంటే ఎక్కువగానే నిబంధనలు
హోదా మాత్రం అటెండర్ కు ఎక్కువ, కలెక్టర్ కు తక్కువ
Accreditation : అత్తెసరు వేతనాలు కొందరికి. మరికొందరికి వెట్టిచాకిరి. కనీసం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అభిమానం లేదు. వృత్తిలోనే జీవితాలను త్యాగం చేస్తున్నారనే సానుభూతి అంతకూ లేదు. ఇలాంటి భాదలు పడుతున్న జర్నలిస్టుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ భాదలు కళ్ళకు కనబడుతున్నా, చెవులకు వినబడుతున్నా… రాష్ట్రప్రభుత్వం వినబడనట్టు, కనబడనట్టుగా ప్రవర్తిస్తోంది. కనీసం ఒక అక్రిడిటేషన్ కార్డు సకాలంలో ప్రభుత్వం ప్రభుత్వానికి సమయం సరిపోవడం లేదు. ఆ కార్డు పొందడానికి ప్రభుత్వం ఆన్ లైన్ లో అడిగిన ఆధారాలకు ఎన్ని అవస్థలు పడాలో అన్ని అవస్థలు పడుతున్నారు అటెండర్ కు ఎక్కువ…. కలెక్టర్ హోదాకు తక్కువైన జర్నలిస్టులు.
ఒక విద్యార్ధి పది, ఇంటర్ ఉతీర్ణత సాధించిన అనంతరం సంబంధిత ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన బదిలీ సర్టిఫికెట్, బోనాఫైడ్ ఆధారంగా ఎమ్మార్వో కులం, నివాసం సర్టిఫికెట్ మంజూరు చేస్తారు**** కనీసం తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ కార్డు ఆధారంగా రవాణా శాఖా మంజూరు చేస్తుంది**** ఇంజనీరింగ్, మెడిసిన్ లో చేరాలంటే ఒక ప్రవేశ పరీక్ష ర్యాంక్ , ఎమ్మార్వో ఇచ్చిన కులం, నివాసం సర్టిఫికెట్ సరిపోతుంది**** ఉపాధ్యాయ వృత్తికి ఏడేళ్ల విద్యార్హత బోనఫైడ్ సర్టిఫికెట్ ఒకే జిల్లాల్లో ఉంటె అదే జిల్లాను అతన్ని స్థానికుడిగా గుర్తిస్తారు జిల్లా సెలెక్షన్ కమిటీ **** ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు కు కేవలం దరఖాస్తు ఫారం పై కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తే చెప్పలేనంత నిజాయితీగా కార్డు మంజూరు చేసింది. రేషన్ కార్డుతో కుటుంబానికి తినేంత సన్నబియ్యం వస్తున్నవి. ****కానీ జర్నలిస్టు కార్డుతో వెలితే పిరికెడు బియ్యం గింజలు కూడా పెట్టదు ప్రభుత్వం.
అక్రిడిటేషన్ కార్డు కోసం ఆన్ లైన్ లో ప్రభుత్వం అడిగిన వివరాలు చూస్తే ఇది బీబీసీ ఉద్యోగం కోసమా, లేదంటే అక్రిడిటేషన్ కోసమా అనే అనుమానాలు జర్నలిస్టుల్లో వ్యక్తమవుతున్నాయి. లాగిన్ కావడంతోనే కష్టాలు మొదలవుతాయి. సర్వీస్ లెటర్లు, అనుభవం లెటర్, నియామకం పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్ , ఇలా ఎన్నో భర్తీ చేయాలి. ఎప్పుడో ముప్పయ్ ఏళ్ల కిందట నియామకమై ఎడిటర్ స్థాయికి ఎదిగిన వ్యక్తిని ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్, విద్యార్హత సర్టిఫికెట్ అడిగితే ఎక్కడినుంచి తెస్తారు. జర్నలిజంలో మండల స్థాయి నియామకంలో రేపటి నుంచి వార్తలు రాయండి అంటారు. కానీ ఇదిగో నీ అపాయింట్ మెంట్ లెటర్ అంటూ పత్రిక యజమానులు చేతిలో పెట్టరు. ఒక ప్రధాన పత్రిక ఐడెంటి కార్డు కూడా ఇవ్వదు. యాజమాన్యంతో పడే భాదలు తెలిసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బీబీసీ పరీక్షను మరిపించే స్థాయిలో వివరాలు అడగటంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తప్పు ముమ్మాటికీ సంఘాలదే అంటున్నారు కలం కార్మికులు. ప్రభుత్వం మాత్రం ఎవరికయినా సమస్య ఉంటె మా వద్దకు రండి. కానీ రోడ్డు ఎక్కకండి అంటోంది. ఉపాధ్యాయ, ఉద్యోగస్టుల సమస్యలను కోర్టు గడప తొక్కకుండానే సంఘాలతో చర్చించి పరిస్కరిస్తోంది ప్రభుత్వం. అటవంటప్పుడు ఇచ్చిన అవకాశాన్ని జర్నలిస్టు సంఘాలు ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదని జర్నలిస్టులు నాయకులను ప్రశ్నిస్తున్నారు. తమ పబ్బం గడుపుకోడానికి, తమ వ్యక్తిగత అభివృద్ధి, తమ సంస్థ పేపర్ కు ప్రభుత్వం నుంచి అన్ని రకాల మేలు జరిగితే సరిపోతుందనే స్వార్థంతోనే సంఘాలు పనిచేస్తున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి, కానీ జర్నలిస్టుల కోసం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఒక గంట సమయం లభించడం లేదా అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.
అసలు ఈ అక్రిడిటేషన్ కార్డు ఉపయోగం ఎంతంటే పెసరి గింజంత కూడా కాదు. కేవలం మమ్మల్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పుకోడానికి. ఒక బస్ పాస్ వస్తుంది. రైల్వె పాస్ ఎలాగూ రద్దయింది. ఈ రోజుల్లో జర్నలిస్టులు ప్రతి రోజు బస్సుల్లోనే తిరుగుతూ వార్తలు రాయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంజూరు చేసిన పథకం ఖర్చు కంటే జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డు మంజూరు ఖర్చు పెద్దది కాక పోవడం విశేషం.

by